మిద్దె చిన్న పుల్లారెడ్డి జీవిత చరిత్ర 1వ భాగం

Midde Chinna Pullareddy Jeevitha Charitra_Part-1

ముందుమాట

        వ్యక్తులు మరణించినా ప్రజలకు వారు చేసిన సేవలు చిరకాలం గుర్తుంటాయి అంటారు అందుకు నిదర్శనం చిన్న పుల్లారెడ్డిగారు. మా అనంతపురం జిల్లాలో వారిని ఇప్పటికీ గుర్తుంచుకున్నారంటే వారు చేసిన నిస్వార్ధ సేవే కారణం. కావేరి సముద్రం పుల్లారెడ్డిగారు మా తండ్రి అనంత వెంకటరెడ్డిగారి కాలంనుండి మా కుటుంబానికి చిరపరిచితులు. మేము ఎక్కడ కలిసినా చాలా ఆత్మీయంగా పలకరించేవారు. చిరునవ్వుతో అందరినీ ఆకట్టుకునేవారు. చక్కటి పంచెకట్టుతో తెలుగు తనం మూర్తీభవించినట్టుగా ఉండేవారు.

     చిన్న పుల్లారెడ్డిగారు ఎప్పుడూ ప్రజల కోసం పని చేసేవారు. వారికి కావలసిన పనులకోసం ఎప్పుడు అనంతపురం వచ్చినా తప్పకుండా మా ఇంటికి వచ్చేవారు. జిల్లా నాయకులతో మంచి సంబంధాలు ఉండేవి. వారు మొదటి నుంచి కాంగ్రేస్వాది అయినా రాజకీయాలకు అతీతంగా ప్రజల కోసం పనిచేసేవారు. ఏ ఎన్నికలు వచ్చినా పార్టీ అభ్యర్థుల విజయానికి శాయశక్తులా కృషి చేసేవారు. నిజాయితీకి, నిర్భీతికీ ఆయన పెట్టింది పేరు ప్రజలకు తప్ప తన కోసం ఏమీ అడగని, చేసుకోని మంచి మనిషి ఆ మంచి తనమే ఆయన్ని మృత్యువుకు చేరువ చేసింది.

Anantha Venkatarami Reddy
శ్రీ అనంత వెంకటరామిరెడ్డి, అనంతపురం శాసన సభ సభ్యులు

పుల్లారెడ్డిగారు మరణించి చాలా సంవత్సరాలు అవుతున్నా ఇవ్వాల్టికీ ఆయన మా ప్రాంత ప్రజలకు గుర్తున్నారు. వారి మీద ప్రజల మనిషి పేరుతో ఒక పుస్తకం తీసుక రావడం నిజంగా చాలా సంతోషించే విషయం.

2 thoughts on “మిద్దె చిన్న పుల్లారెడ్డి జీవిత చరిత్ర 1వ భాగం

  1. This article provided a lot of valuable information. The author’s perspective was both refreshing and enlightening. It would be interesting to hear how others feel about these points. Any thoughts?

  2. Great read! The author’s analysis was both thorough and engaging. I found myself thinking about it long after reading. What did you all think about this?

Leave a Reply to Emmat Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these

sreemcpullareddysevasamithi