"కావేరి సముద్రం" గ్రామం పేరు చెప్పగానే గుర్తుకొచ్చే ఒకే ఒక్క పేరు
"మిద్దె చిన్న పుల్లారెడ్డి"
అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణానికి సమీపంలో ఉన్న ఓ చిన్న గ్రామం కావేరి సముద్రం. ఈ గ్రామం తూర్పున నంద్యాల నుంచి తాడిపత్రి వెళ్లే రోడ్డు మార్గంలో ఉంది . పడమరలో గంగదేవిపల్లె, ఉత్తరాన గోస్వారుపల్లె, దక్షిణాన పెన్నానది ఉన్నాయి.
ప్రధాన రహదారి నుంచి ఒకటిన్నర కిలో మీటర్ల దూరంలో ఉంది కావేరి సముద్రం. ఈ గ్రామంలో సంజీవరెడ్డి, రంగమ్మ దంపతులకి రెండవ సంతానంగా చిన్న పుల్లారెడ్డి జన్మించారు.
కావేరి సముద్రం గ్రామంలో 800 ఇళ్లు ఉంటాయి. రెడ్లు, హరిజనులు ఎక్కువ. మిగతా కులాల వారితో పాటు ముస్లిమ్ లు కూడా ఈ గ్రామంలో ఉన్నారు.
పక్కనే పెన్నా నది ఉన్నా ఈ గ్రామంలో పంట కాలువలు లేవు. వర్షాధార పంటలపై ఆధారపడాల్సిందే. పొలాల్లో బావులు తవ్వించుకొని తద్వారా పంటలను పండించుకుంటారు.
ఇక్కడ జొన్న, కొర్ర వేరు శనగ, కంది, రాగులు, పత్తి, ఆముదం, మొక్కజొన్న మొదలైన పంటలను రైతులు పండిస్తారు.
ఈ గ్రామం పేరు చెప్పగానే గుర్తుకొచ్చే ఒకే ఒక్క పేరు మిద్దె చిన్న పుల్లారెడ్డి.
ఐదడుగుల ఏడు అంగుళాల ఎత్తు. పసిమి ఛాయ. గుండ్రటి ముఖం. గుబురు మీసాలు. గంభీరమైన విగ్రహం. పెదవులపై ఎప్పుడూ చిరునవ్వు చెరగదు.
తెల్లటి లాల్చి, పంచ కట్టుతో ఆకట్టుకొనే రూపం ఆయన ప్రత్యేకతలు.
చిన్న పుల్లారెడ్డి రాజకీయంగా పెద్ద పదవులను చేపట్టకపోయినా వ్యక్తిగా అనంతపురం జిల్లాలో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు.
ఆయన పేరు చెప్పగానే కావేరి సముద్రం పుల్లారెడ్డిగారా? అనే స్ధాయికి ఎదిగారు. మంచితనం, మాటతనంతో ఎదిగిన పుల్లారెడ్డికి రాజకీయంగా మంచి భవిష్యత్ ఉంటుందని అందరూ ఊహించేవారు. తానొకటి తలిస్తే దైవం మరోటి తలిచింది.
సశేషం…